మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి.. హోం శాఖ కీలక నిర్ణయం!

-

మధ్య ప్రదేశ్ హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జెండర్ మార్చుకున్న తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగేందుకు ఓ మహిళా కానిస్టేబుల్ పెట్టుకున్న అభ్యర్థకు… మధ్యప్రదేశ్ హోం శాఖ అనుమతి ఇచ్చింది. మహిళా కానిస్టేబుల్ అమిత జెండర్ ను మార్చుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనుమతి ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లింగమార్పిడి కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలి కేసు అని ఆ రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రజోర తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హోం శాఖ బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు. ఆ మహిళా కానిస్టేబుల్ కు చిన్నప్పటి నుంచి.. జెండర్ ఐడెంటిటీ డిసార్డర్ సమస్య ఉందని… జాతీయ స్థాయి సైకియాట్రిస్టులు కూడా దీనిని ధ్రువీకరించారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019లో గెజిట్ ఆఫ్ ఇండియా లో ఉన్న అఫిడవిట్ ప్రకారం మహిళ అభ్యర్థనకు తాము ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ అభ్యర్థనలో ఎలాంటి తప్పు లేదని ప్రభుత్వం భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news