22 దేశాాలకు పాకిన ఓమిక్రాన్ వేరియంట్.. ఆ దేశాలు ఇవే..

-

కరోనా కొత్త రూపం ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకు ఇలా విస్తరించే దేశాల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ అక్కడ నాలుగైదు దేశాలకే పరిమితమైంది. కానీ ఇటీవల వేగంగా ఇతర దేశాాలకు కూడా విస్తరింస్తోంది. జపాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలు విదేశీయులకు సరిహద్దుల్ని మూసినా.. కేసులు నమోదయ్యాయి. దీంతో ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలపై ఇతర ప్రపంచ దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. మొత్తం 22 దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. తాజాగా సౌదీ అరేబియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసు నమోదైంది. నిన్న జపాన్ లో కూడా ఓమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది.omicron

తాజాగా ఓమిక్రాన్ విస్తరించిన దేశాలు ఇవే… ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బోట్స్వానా, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నైజీరియా, పోర్చుగల్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యూకే. ఈ దేశాల్లో ప్రస్తుతం కేసులు నమోదు కావడంతో అక్కడ ప్రభుత్వాాలు ఆందోళన పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news