రానున్న రోజుల్లో రెండు పెద్ద పండుగలు ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో దసరా, నవంబర్‌లో దీపావళి పండుగ ఉన్నందున తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లను వేసింది. ఎందుకంటే అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తున్న వారి కోసం స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. దసరా పండుగ తెలంగాణలో గ్రాండ్‌గా జరుపుకుంటారు.
ఆంధ్రలో దీపావళి పండుగను పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో బస్సులు, రైలు సర్వీసులు రద్దీతో ఉంటాయి. ముందే రిజర్వేషన్లు కూడా చేసేసుకుంటారు.తగినన్ని సౌకర్యాలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడకూడదనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. 07487 నెంబర్ గల ట్రైన్‌లో 6 ట్రిప్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.సికింద్రాబాద్, నల్గొండ, అన్నవరం, విజయనగరం,శ్రీకాకుళం రోడ్డు వరకు ఈ రైళ్లు వెళతాయని అధికారులు తెలిపారు.