హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

-

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్‌, ఉందానగర్ – లింగంపల్లి, ఫలక్‌నుమా – లింగంపల్లి, రామచంద్రాపురం – ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌లు రద్దు చేశామన్నారు.

Hyderabad: Call to resume MMTS gets louder

అయితే ఆయా రైలు మార్గాల్లో మౌలిక వసతి సదుపాయాల అభివృద్ధి పనుల వల్ల ఈ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా.. మొత్తం 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news