FIFA: భారత్‌ ఫుట్‌బాల్‌కు శుభవార్త.. ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం ఎత్తివేత

-

ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ఫిఫా శుక్రవారం ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రమేయాన్ని సుప్రీంకోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ వేదికగా అక్టోబర్ లో జరగాల్సిన ప్రతిష్టాత్మక మహిళల అండర్-17 ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగుమయింది.

‘ఏఐఎఫ్ఎఫ్ పరిపాలన వ్యవహారాల్లో సిఓఏ కలుగజేసుకోవడంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తిరిగి పాలన పగ్గాలు ఏఐఎఫ్ఎఫ్ చేతుల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఫిఫా కౌన్సిల్ సస్పెన్షన్ ఎత్తివేతకు ముగ్గు చూపింది మొగ్గు చూపింది. ఈ కారణంగా షెడ్యూల్ ప్రకారం మహిళల అండర్-17 ప్రపంచ కప్ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. నిబంధనలకు అనుగుణంగా ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు జరిగేలా ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ పర్యవేక్షిస్తుంది’ అని ఫిఫా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news