ఓటీటీలోకి రానున్న ‘ఫైటర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

-

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా,దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఫైటర్‌’. అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పఠాన్, వార్ సినిమాల‌ ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జనవరి 25న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించింది.

ఇప్పుడీ ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 20 రాత్రి 12 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉండనుంది. థియేటర్లో రిలీజ్ అయి విమర్శకులను సైతం మెప్పించిన ఈ సినిమా మరి ఓటీడీలో ఏమిరా రాణిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news