అత్యంత వేగంగా … ఆ మార్క్ అందుకున్న మూవీగా ‘ఫైటర్’

-

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా,దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఫైటర్‌’. అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పఠాన్, వార్ సినిమాల‌ ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జనవరి 25న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు.

కాని ఫైటర్ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతోంది. 10 రోజుల్లోనే 12.5M వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. నెటిక్స్లో అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న బాలీవుడ్ సినిమాగా నిలిచినట్లు వెల్లడించారు. రణబీర్ కపూర్ నటించిన యానిమల్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం థియేటర్లలో దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news