బీజేపీ, జనసేనతో కలిసి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవైనా అమలు చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. తిరుపతి లోని నాయుడుపేట మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రూ.87వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశారా? రూ.14వేల కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేశారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా?’ అని నిలదీశారు.
విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనం.. మోసాలు, కుట్రలు మరో వైపు యుద్దం జరుగుతోంది. ఈ ఎన్నికలు.. మన ఓటుతో రాబోయే ఐదేళ్లు అధికారం ఇస్తారు. ఈ అధికారంతో మన తలరాతలు మారుతాయి. అందుకే 175కి 175 ఎమ్మెల్యేలు.. 25 లోక్ సభ సీట్లతో.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. కొంచెం ఓపిక పట్టండి.. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది అని అన్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మీ దీవెనలు, ఆశీస్సులు కావాలి.వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం పైనే నా మొదటి సంతకం అని హామీ ఇచ్చారు.