ఏపీలో నాలుగో విడత ఎన్నికలు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు పార్టీల మేరకు ఇలా ఉన్నాయి. ముందు జరిగిన ఏకాగ్రీవాలు సహా
రాయల సీమ :
అనంతపురం జిల్లాలో నాలుగో విడతలో 184 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 154, టీడీపీ 28, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నారు. కడప జిల్లాలో నాలుగో విడతలో 224 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 203, బీజేపీ 16, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడతలో 375 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 317, టీడీపీ 46 ఇతరులు 12 స్థానాలు గెలుచుకున్నారు. కర్నూలు జిల్లాలో నాలుగో విడతలో 292 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 231, టీడీపీ 53, ఇతరులు 8 స్థానాలు గెలుచుకున్నారు.
ఉత్తరాంధ్ర :
విశాఖ జిల్లాలో నాలుగో విడతలో 117 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 70, టీడీపీ 24, జనసేన 2, టీడీపీ 1, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. విజయనగరం జిల్లాలో నాలుగో విడతలో 296 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 216, టీడీపీ 52, బీజేపీ 1, ఇతరులు 27 స్థానాలు గెలుచుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగో విడతలో 274 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 214, టీడీపీ 54, జనసేన 1, బీజేపీ 2, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు.
కోస్తాంద్ర :
ప్రకాశం జిల్లాలో నాలుగో విడతలో 208 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 178, టీడీపీ 25, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగో విడతలో 236 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 195, టీడీపీ 25, బీజేపీ 3, సీపీఎం 2, ఇతరులు 11 స్థానాలు గెలుచుకున్నారు. ప.గో జిల్లాలో నాలుగో విడతలో 266 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 193, టీడీపీ 55, జనసేన 13, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. తూ.గో జిల్లాలో నాలుగో విడతలో 273 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 164, టీడీపీ 61, జనసేన 30, బీజేపీ 1 ఇతరులు 14 స్థానాలు గెలుచుకున్నారు. గుంటూరు జిల్లాలో నాలుగో విడతలో 266 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 174, టీడీపీ 69, జనసేన 6, బీజేపీ 1, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు. కృష్ణా జిల్లాలో నాలుగో విడతలో 288 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 216, టీడీపీ 57, జనసేన 3, ఇతరులు 12 స్థానాలు గెలుచుకున్నారు.