ఎట్టకేలకు పెళ్లి పై నోరు విప్పిన యాంకర్ ప్రదీప్..!

-

బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా యాంకర్ ప్రదీప్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ యాంకరింగులో కొత్త కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు.. సాదా సీదా గానే కెరియర్ను ప్రారంభించిన ఇతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో యాంకరింగ్ లో కూడా తనదైన ముద్రను చూపిస్తూ దూసుకుపోతున్న ఈయనకు ఫలితంగా వరుసగా షో లలో ఆఫర్లు వస్తున్నాయి.

ఇకపోతే ఈ స్టార్ యాంకర్ పెళ్లిపై చాలా రోజులుగా వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రదీప్ తన పెళ్లిపై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇకపోతే బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ పెళ్లి అనే విషయంపై మాట్లాడుతూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఇటీవల ప్రముఖ స్టైలిస్ట్ నవ్య మారోతు ను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. దీంతో ఇది నిజమేనని అందరూ అనుకుంటూ ఉండగా ఫలితంగా ఓరేంజ్ లో ఈ వార్త హాట్ టాపిక్ అయిపోయింది.

తాజాగా ప్రదీప్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో పాల్గొన్నాడు. దీనికి గెస్ట్ గా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే నాలుగైదు రోజులుగా ఏదో న్యూస్ వింటున్నాను.. ప్రదీప్ మాచిరాజు చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు? అని అన్నారు. దీంతో వెంటనే ప్రదీప్ ఆ అమ్మాయి ఎవరో చూస్తే నేను కూడా షాక్ అవుతాను సార్ అంటూ ఆ వార్తలను ఖండించారు. మొత్తానికి తనపై వస్తున్న పెళ్లి వార్తలకు పులిస్టాప్ వేసే ప్రయత్నం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news