అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్న ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్

-

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. తాాజాగా ఆర్థిక శాఖ గురించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్. ఆర్థిక శాఖ సెక్రటరీ కేవీవీ సత్యనారాయణను ఈ నెల 18వ తేదీ తర్వాత కూడా విధుల్లో కొనసాగాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీతో ముగియనుంది కేవీవీ సత్యనారాయణ డెప్యూటేషన్ గడువు. ఆర్థిక శాఖలో భారీ ఎత్తున అవకతవకలపై కేవీవీ ప్రమేయం ఉందన్న అభియోగాలున్నాయి.

ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి ధనుంజయ్ రెడ్డి సూచనల మేరకే కేవీవీ అడ్డగోలు చెల్లింపులు జరిపినట్టు గుర్తించారు. కేవీవీ సత్యనారాయణ రిలీవ్ అయిపోతారనే ప్రచారం జరుగుతోంది. కేవీవీని ఫిక్స్ చేసేలా సీఎస్ నీరబ్ ముందస్తు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news