ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. నిన్న ఎన్నికల గురించి ఆయన చేసినటువంటి కామెంట్ ప్రపంచ వ్యాప్తంగా సెన్షేషన్ అవుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో EVMలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించవచ్చంటూ సూచించారు. అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా X వేదికగా స్పందించారు మస్క్. EVMలను వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని.. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో EVMలు తొలగిస్తేనే హ్యాకింగ్‌ను నివారించొచ్చు.. వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.. అంటూ ట్వీట్ చేశారు.
దీంతో ఎలన్ మస్క్ కు X వేదికగా పురంధేశ్వరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈవీఎం లను హ్యాక్ చేయగలరు అంటున్న ఎలెన్ మస్క్ ను ఇండియా కి పిలవాలని నిర్ణయించారు. ఎలన్ మస్క్ ని మన ఈవీఎం లను హ్యాక్ చేసి చూపించమని ఎలక్షన్ కమీషన్ అడగాలన్నారు. ఎంతమంది ప్రయత్నించినా మన ఈవీఎం లు హ్యాక్ చేయలేరు అని ట్వీట్ చేశారు పురంధేశ్వరి.