టీఆర్ఎస్ భవన్‌ సంబరాలలో అపశృతి

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఒక అభ్యర్థి గెలవడం మరో ఆహ్బ్యార్ది గెలుపుకు దగ్గర ఉండడంతో కార్యకర్తలు ఆనందం పట్టలేకపోయారు. ఆఫీస్ వద్ద బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతా బానే ఉంది కానీ పైకి కాల్చిన బాణాసంచా తిరిగి వచ్చి బిల్డింగ్ పక్కనే ఉన్న తాటాకుల పందిరికి నిప్పంటుకుంది.

దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి అదుపులోకి తీసుకురాగలిగారు. అయితే అప్పటికే దాదాపు పందిరి అంతా అగ్నికి ఆహుతైంది. ఇక మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణి దేవి విజయం సాధించారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యతా ఓటుతో ఆమెకు విజయం దక్కింది. ఆమె విజయాన్ని ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...