పవన్ సినిమాతో కొత్త బిజినెస్ కి శ్రీకారం చుట్టనున్న విజయ్ దేవరకొండ..

-

లైగర్ సినిమాతో మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడానికి వస్తున్న విజయ్ దేవరకొండ, సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రౌడీ పేరుతో బట్టల వ్యాపారంలోకి దిగిన విజయ్, తాజాగా థియేటర్ల బిజినెస్ లోకి దిగుతున్నాడని సమాచారం. ఏషియన్ సినిమాస్ తో కలిసి థియేటర్ల వ్యాపారంలోకి దిగుతున్నాడని అంటున్నారు. మహేష్ బాబు ఏఎమ్ బీ సినిమాస్ లాగానే ఏవీడీ పేరుతో థియేటర్ ని మొదలెడుతున్నాడు.

మహబూబ్ నగర్లోని ఒక పాత థియేటర్ ని బాగు చేయించి మల్టీప్లెక్స్ మాదిరిగా తయారు చేయిస్తున్నాడు. ప్రస్తుతం పునఃనిర్మాణంలో ఉన్న ఈ థియేటర్లో మొదటి బొమ్మ పవన్ కళ్యాణ్ దే పడనుందట. మూడేళ్ల విరామం తర్వాత పవన్ చేస్తున్న తొలి సినిమా వకీల్ సాబ్ తో ఈ థియేటర్ ఓపెన్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి అటు సినిమాలు చేస్తూనే, ఇలా సరికొత్త వ్యాపారాలు మొదలెట్టే హీరోల్లో విజయ్ దేవరకొండ చాలా ముందున్నాడు. మరి ఈ బిజినెస్ విజయ్ కి ఎలా కలిసొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news