మధ్య ప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఆస్పత్రిలో మంటలు చెలరేగి నలుగురు నవజాత శిశువులు మరణించారు. భోపాల్ లోని కమల నెహ్రు ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగిని ప్రమాదం క్రమంగా పిల్లలు ఉండే వార్డుకు చేరుకుంది. మొత్తం 40 మంది పిల్లలు ఉండగా…36 మందిని అధికారులు రక్షించారు. మరో 4 గురు మాత్రం చనిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి విశ్వాస్ సారంగ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. మొత్తం 12 ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమయంలో వార్డల్లోకి పొగ చేరి నల్లగా మారాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి విశ్వాస్ సారంగ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన పిల్లల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు ముఖ్యమంత్రి. ఘటనకు విద్యుత్ షాట్ సర్క్యూల్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై హైలెవల్ కమిటీతో విచారణ చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.