టీ ట్వంటి ప్రపంచ కప్ లో టీమిండియా పోరాటం ముగిసింది. సెమీస్ అవకాశాలు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ తో నే చేజారినా.. సోమవారం రాత్రి నమీబియాతో చివరి మ్యాచ్ ను టీమిండియా ఆడేసింది. ఈ మ్యచ్ లో పసికూన నమీబియా పై ఘన విజయం సాధించి ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలచి తొలత నమీబియా కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది టీమిండియా. నమీబియా నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగుల చేసింది.
భారత స్పిన్నర్లు విజృంభించడం తో నమీబియా ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా 4 ఓవర్లలో కేవలం 16 పరుగుల ఇచ్చి 3 వికెట్ల తీశాడు. అలాగే మరొక్క స్పిన్నర్ రవీచంద్ర అశ్వీన్ కూడా 3 వికెట్లు తీశాడు. వీరికి తోడుగా పేసర్ బుమ్రా 2 వికెట్ల తీశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు.
రోహిత్ శర్మ56(37), కె ఎల్ రాహుల్54(36) ఇద్దరు అర్థ శతకం బాదారు. అంతే కాకుండా మొదటి వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్య కమార్ యాదవ్ 25(19) తో కె ఎల్ రాహుల్ లంచనాన్ని ముగించాడు. కాగ పొదుపు బౌలింగ్ చేస్తు 3 వికెట్లు తీసిన జడేజా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.