నేడు సీఎం జగన్ ఒడిశా పర్యటన… షెడ్యూల్ ఇదే

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఒడిశాకు ఇవాళ వెళ్లనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఉదయం 10.45 కు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న సీఎం జగన్‌.. ధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకోనున్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం… శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ కు ప్రయాణం కానున్నారు. సాయంత్రం 5.20 కు భువనేశ్వర్ లోని లోకేశ్వర భవన్ కు చేరుకోనున్న సీఎం.. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో దాదాపు గంటన్నర పాటు సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి వివిధ పెండింగ్‌ అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరుగ నున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్‌ చేరు కోనున్నారు. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ శమీర్ శర్మ, ఇతర ఉన్నతా ధికారులు పాల్గొననున్నారు.