విశాఖలో భారీ అగ్ని ప్రమాదం

ఈ మధ్య కాలంలో విశాఖపట్నం లో వరుస ప్రమాదాలు కాస్త తగ్గాయి ఆమె చెప్పాలి. గతంలో తరచూ జరిగే ఈ ప్రమాదాలు ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చాయి. అయితే తాజాగా మరో అగ్ని ప్రమాదం విశాఖలో కలకలం రేపుతోంది. విశాఖ లోని పరవాడ ఫార్మా సిటీ లో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీపీఆర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అర్ధరాత్రి దాటాక మూడు సార్లు పేలుళ్లు సంభవించాయి.

ప్రమాద సమయంలో లోపల 20 మంది సిబ్బంది ఉన్నారని అంటున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది హుటాహుిన ఘటానా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే పేలుళ్లకు గల కారణం అయితే ఇంకా తెలియరాలేదు. అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు, ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగిందని ఫ్యాక్టరీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.