ఓ వైపు కరోనా మానవాళిపై పంజా విసురుతుంటే మరో వైపు ప్రకృతి విపత్తులు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తర ఆఫ్రికా లోని అల్జీరియాలో కార్చిచ్చు అంటుకుంది. అయితే సహాయ కార్యక్రమాల కోసం వెళ్లిన ఆర్మీలో 25 మంది సైనికులు ఈ కార్చిచ్చుకు బలయ్యారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఏడుగురు సాధారణ ప్రజలు కూడా కార్చిచ్చుకు కారణంగా మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆఫ్రికా లోని వేలాది ఎకరాల్లో ఉన్న ఆలివ్ తోటలు కూడా ధ్వంసమయ్యాయి.
భారీగా జంతువులు, పక్షులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. అడవుల్లో మంటల కారణంగా జంతువులన్నీ రోడ్లపైకి పరుగులు తీస్తున్నాయి. ఇక ప్రస్తుతం అడవుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ ప్రకటించారు. మంటలను ఆర్పేందుకు సహాయక బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. ఇక గతంలో ఆస్ట్రేలియా లోనూ ఇలాంటి కార్చిచ్చే రేగగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు అడవులను దహించివేసింది. ఈ ఘటన యావత్ ప్రపంచం మొత్తాన్ని కలచివేసింది.