ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ !!

తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి వద్ద ఉధృతం గా గోదావరి వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యం లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొద్దీ గంట ల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 11 30 అడుగులకు వరద నీటి మట్టం చేరింది. 11.75 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవకశాలు ఉన్నాయి.

అటు బ్యారేజీ నుండి 9,11,838 క్యూసెక్కులు మిగులు జలాలు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి డెల్లా కాలువలకు 10,200 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో ని భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతోంది. ఇక అటు రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి మరికొంత పెరిగి తరువాత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.