డెల్టా ప్లస్ వేరియంట్‌తో ముంబైలో మొదటి మరణం

-

మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా మొదటి మరణం నమో దైంది. ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27 వ తేదీన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కరోనా కు గురై మరణించింది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తో మరణించిన మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా.. వైరస్‌ సోకిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకి.. ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడిందని వైద్యులు వెల్లడించారు. మరణించిన మహిళకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిందని తేలినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.ఆ మహిళ కుటుంబంలోని ఆరుగురు కూడా కరోనా మహమ్మారి బారీన పడ్డారని తెలిపారు. ఆరుగురు కరోనా రోగుల్లో ఇద్దరి కి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలిందని బీఎంసీ అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news