వాహనదారులకు శుభవార్త : రూ.3 తగ్గిన పెట్రోల్‌ ధర !

-

మన దేశంలో పెట్రోల్‌ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటాయి పెట్రోల్‌ ధరలు. దీంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.  అయితే.. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ రేట్లు మండిపోతున్న తరుణం లో తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన స్టాలిన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

లీటర్‌ పెట్రోల్‌ పై రూ. 3 మేర వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళినివేల్‌ త్యాగరాజన్‌ కీలక ప్రకటన చేశారు. దీని వల్ల రాష్ట్ర ఖాజానా కు రూ. 1160 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అయినప్పటికీ తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పు కొచ్చారు. తమిళనాడు లో రూ. 102.49 ఉన్న పెట్రోల్‌… సర్కార్‌ నిర్ణయంతో రూ. 100 కంటే తక్కువగా కానుంది. ఇక తమిళనాడు సర్కార్‌ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news