ఉద్యోగులకు అలర్ట్.. అలా చేయకపోతే… జీతంలో కోత పక్కా..!

-

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక విషయాలని వెల్లడించింది. ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇకపై కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటోంది. మీరు ట్యాక్స్ రెజిమ్ ని కనుక ఎంపిక చెయ్యకపోతే మీకు కొత్త ట్యాక్స్ విధానమే వర్తిస్తుంది. ఒక వేళ కనుక మీరు పాత పన్ను విధానం లో కొనసాగాలని అనుకున్నట్లయితే తప్పక ఆప్షన్ ని ఎంపిక చేయాల్సి వుంది.  అది కూడా ఆర్థిక ఏడాది ప్రారంభం లోనే. మీరు మీ ట్యాక్స్ విధానాన్ని సెలెక్ట్ చెయ్యాలి. ఒకవేళ కనుక మీరు ఏ ఏ పన్ను విధానంలో ఉండాలనుకుంటున్నామో ఎంచుకోకపోతే అది మీ యొక్క శాలరీ పైన ప్రభావం చూపచ్చు.

ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఉండాలనుకోవాలని మీరు కనుక ఇవ్వకపోతే కొత్త ట్యాక్స్ విధానమే అమలవుతుంది. కొత్త పన్ను విధానం ప్రకారమే టీడీఎస్ కట్ అయిపోతుంది చూసుకోండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ మేరకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. పన్ను విధానంపై ఉద్యోగి సమాచారం ఇవ్వక పోతే ఆ ఉద్యోగి డిఫాల్ట్ పన్ను విధానంలో కొనసాగుతారని అంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 కింద ఆదాయంపై సెక్షన్ 115బీసీఓలోని సబ్ సెక్షన్ 1ఏ రేట్ల ప్రకారం ఆయా ఉద్యోగి కి టీడీఎస్ కట్ చేస్తారని చెప్పింది.

ఏ నిర్ణయం ని ఉద్యోగి తీసుకోని సందర్భంలో కొత్త పన్ను విధానం ప్రకారమే టీడీఎస్ కట్ చేస్తుంది యాజమాన్యం. కంపెనీ యజమాని తప్పనిసరిగా ఉద్యగుల నుంచి పన్ను విధానంపై స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న విధానం ద్వారానే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కట్ చేయాలి. కనుక ఉద్యోగి ఈ విషయంపై సమాచారం ఇవ్వాలి. కొత్త పన్ను విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు రూ.25000 రిబేట్ వుంది.

Read more RELATED
Recommended to you

Latest news