Pooja Hegde : ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో పూజ సొగసుల బాణం

-

పూజా హెగ్డే ట్రెడిషనల్ లుక్​లో అదరగొట్టింది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ చుడీదార్​లో పూజ సోయగం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అచ్చతెలుగు అమ్మాయిలా ఈ భామ తెగ అందంగా కనిపిస్తోంది. ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ కెమెరాకు క్యూట్ పోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి.

ఇటీవలే పూజ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో థియేటర్​లో సందడి చేసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్​కు జంటగా నటిించింది. ఈ చిత్రంలో వెంకటేశ్ కూడా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో పూజ వరుసగా ఆరు ఫ్లాపులను మూటగట్టుకున్నట్లు అయింది. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం జోరుగానే వస్తున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్-పూజాలది హిట్ కాంబో. మహేశ్ బాబు – పూజాది కూడా సూపర్ హిట్ జోడీయే. మరి ఈ సినిమాతోనైనా పూజాకు హిట్ వరిస్తుందా లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news