శ్రీకారం సాంగ్: మిక్కీ జే మేయర్ మారిపోయాడబ్బా..

శర్వానంద్ హీరోగా నటిస్తున్న శ్రీకారం సినిమా నుండి తాజాగా భలేగుంది బాలా అనే పాట రిలీజైంది. కిషోర్ దర్శకత్వం వహిస్తున్న శ్రీకారం సినిమాలోని ఈ పాటని రాయలసీమకి చెందిన పెంచల్ దాస్, రచించి మరీ గళం అందించాడు. పెంచల్ దాస్ గొంతులోని స్వచ్చమైన పల్లెటూరి దనం, యాస అన్నీ కలిపి ఈ పాటని మరింత అందంగా చేసాయి. పూర్తి మాస్ గెటప్ లో కనిపిస్తున్న శర్వానంద్ కి ఈ పాట చక్కగా సరిపోయింది.

ఐతే ఈ పాటకి సంగీతం అందించిది ఎవరో తెలిస్తే కొంచెం ఆశ్చర్యం కలగక మానదు. శేఖర్ కమ్ముల సినిమాలకి సున్నితమైన మెలోడీలని అందించిన మిక్కీ జే మేయర్, శ్రీకారం సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. గతంలో పూర్తిస్థాయి మెలోడీలనే అందించిన మిక్కీ జే మేయర్, ఇలాంటి మాస్ సాంగ్ ఇచ్చాడంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాతో మిక్కీ జే మేయర్ చాలా మారిపోయినట్టు తెలుస్తుంది.

దర్శకుల కోరిక మేరకు ఏ జోనర్ లో కావాలంటే ఆ జోనర్లో మ్యూజిక్ ఇవ్వగలడని అందరికీ మరోసారి అర్థమయ్యింది.