కోలుకున్న రాజశేఖర్.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్

నటుడు రాజశేఖర్ గత కొద్ది రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ తో పాటు ఆయన భార్యకు, ఇద్దరు కుమార్తెలు కూడా కరోనా సోకింది. అయితే ముందు ఇద్దరు కుమార్తెలకు కరోనా తగ్గిపోగా భార్యకు కూడా తర్వాత కరోనా తగ్గిపోయింది.

అయితే రాజశేఖర్ కు కరోనా తగ్గినా అనారోగ్య సమస్యలు వదలలేదు. ఒకానొక దశలో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమ పరిస్థితికి కూడా చేరుకుంది. అయితే ఆసుపత్రి వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. ఈరోజు డిశ్చార్జ్ కావడంతో ఆసుపత్రిలో ఉన్న వైద్యులు ఇతర సిబ్బంది ఈయనతో అలానే భార్య పిల్లలతో ఫోటోలు కూడా దిగారు. నిజానికి ఆయనకు చాలా రోజుల క్రితమే కరోనా నెగటివ్ వచ్చినా ఆయనకు శ్వాస సంబందింత ఇబ్బందులు ఉండడంతో ఆయనకు ఆరోగ్య పరిస్థితి విషమించింది.