ఘోర రోడ్డు ప్రమాదం.. 50 అడుగుల నుండి నదిలో పడ్డ బస్సు

-

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 50 అడుగుల పైన ఉన్న వంతెన నుంచి నదిలోకి మినీ బస్సు పడిపోయింది. సతారాలోని పూణే-బెంగళూరు పూణే-బెంగళూరు రహదారిపై ఒక మినీ బస్సు నదిలో పడిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక మహిళ, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. మినీ బస్సులో ఉన్న కుటుంబం దీపావళి కోసం గోవా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఉంబ్రాజ్ సమీపంలోని తార్లి నదిలో బస్సు పల్టీకొట్టింది. కుప్పకూలిన బస్సును నుండి ఏడుగురిని మంచం సాయంతో విజయవంతంగా బయటకు తీశారు. క్షతగాత్రులను సతారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇక మరో పక్క గోండియాలో గోండియా పోలీస్ ఫోర్స్ తరపున దీపావళి సందర్భంగా, ఆదివాసీ సోదరులతో దీపావళిని జరుపుకోవడానికి వస్తున్న పోలీసు వాహనానికి ప్రమాదం జరిగింది. పత్రతోలా గ్రామం సమీపంలో ఒక ప్రైవేట్ వాహనం అదుపు తప్పగా అదే ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో ఒక పోలీసు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు గోండియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news