ఈ రోజుల్లో యాసిడిటీ సా«ధారణ సమస్యగా మారింది. దీని బారిన పడి చాలా మంది బాధపడుతున్నారు. ఏ ఫుడ్ పడితే అది తింటే కూడా ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీనివల్ల మన శరీరంలోని పీహెచ్ లెవల్ బ్యాలన్స్ అవుతుంది. ఆ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం.
- చల్లని పాలు
పాలలో ఉండే రిచ్ కాల్షియం వల్ల యాసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. కడుపులో మంటను కూడా త్వరగా తగ్గిస్తుంది పాలు. కడుపులో ఉండే యాసిడిక్ వ్యర్థాలను అబ్జర్బ్ చేస్తుంది. - వాము
తరుచూ వచ్చే గ్యాస్ ట్రబుల్ సమస్యకు వాము మంచి ఫుడ్. ఇందులో ఉండే యాక్టివ్ ఎంజైమ్స్, బయో కెమికల్ థైమల్ యాసిడిటీకి చెక్ పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. - యాపిల్‌సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ తాగటం వల్ల శరీరంలోని పీహెచ్ లెవల్ అదుపులో ఉంటుంది. దీంతో మీ జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. 1–2 టేబుల్ స్పూన్ల వెనిగర్‌ను రోజూ ఒక కప్ నీళ్లలో వేసుకుని తీసుకోవాలి. - తులసి
దీన్నే బెసిల్ లీవ్స్ అని కూడా అంటారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కడుపులో పేరుకుపోయిన యాసిడ్ వ్యర్థాలకు తక్షణ రిలీఫ్‌ని ఇస్తుంది.
దీన్ని ఆకులను తినొచ్చు లేదా నీళ్లలో తులసి ఆకులను నానపెట్టి ఆ వాటర్‌ను తరచూ తాగుతుండాలి. - సోంపు
గుండెమంట, యాసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కడుపునొప్పిని కూడా తగ్గించేస్తుంది. సోంపు, మిస్ట్రీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. - నాన్ సిట్రస్ ఫుడ్
అరటిపళ్లు, యాపిల్స్, వాటర్ మిలన్, హనీడ్యూ, క్యాంటాలోప్, మిగతా సిట్రస్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వీటి జ్యూస్‌తో శరీరంలో హైడ్రేషన్‌ను పెంచుతుంది. - కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు కూడా యాసిడిటీని తగ్గించే మంచి పానియం. దీనివల్ల పీహెచ్ లెవల్ కూడా అదుపులో ఉంటుంది. పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల యాసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. - అల్లం
గుండెమంట, డైజేషన్ ఇతర సమస్యలకు అల్లంతో అ«ధిగమించవచ్చు. మీరు తినే ఆహారంలో జింజర్‌ను ఎక్కువ శాతం వేసుకుని తీసుకోవాలి.