శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వారికి బిగ్ అలర్ట్. ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల దారి మళ్ళిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కు రావలసిన పలు విమానాలను ఇప్పటికే దారి మళ్ళించారు అధికారులు.

శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ఏమాత్రం వాతావరణం అనుకూలంగా లేదని తెలుస్తోంది. దీంతో విమానాలను మళ్ళిస్తున్నారు. ముంబై నుంచి హైదరాబాద్, వైజాగ్ నుంచి హైదరాబాద్, జైపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు