ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఫోన్లు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగ‌స్టు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, యాక్స‌స‌రీల‌ను అత్యుత్త‌మ ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు.

flipkart big saving days sale started offers discounts

ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020ని రూ.5501 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.36,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్‌ను రూ.7501 త‌గ్గింపుతో రూ.44,999కు, ఐఫోన్ 7 ప్ల‌స్‌ను రూ.2901 త‌గ్గింపుతో రూ.34,999కు, ఐఫోన్ 7 32జీబీ ఫోన్‌ను రూ.1401 త‌గ్గింపుతో రూ.28,499కి, ఐఫోన్ ఎక్స్ఎస్ 64జీబీని రూ.29,901 త‌గ్గింపుకు రూ.59,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎ31 (6జీబీ, 128జీబీ)ని రూ.4వేల త‌గ్గింపుతో రూ.20,999 ధ‌రకు, గెలాక్సీ ఎ80 (8జీబీ, 128జీబీ)ని రూ.22,001 తగ్గింపుతో రూ.29,999కు, రెడ్‌మీ కె20 ప్రొ (6జీబీ, 128జీబీ)ని రూ.4వేల త‌గ్గింపుకు రూ.22,999 ధ‌ర‌కు, రెడ్‌మీ కె20 (6జీబీ, 64జీబీ)ని రూ.1వేయి త‌గ్గింపుతో రూ.21,999 కు, రెడ్‌మీ 8 (4జీబీ, 64జీబీ)ని రూ.1వేయి త‌గ్గింపుతో రూ.9,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.

అలాగే రియ‌ల్‌మి ఎక్స్2 ప్రొ (8జీబీ, 128జీబీ)ని రూ.28,999కు, రియ‌ల్‌మి సి2 (2జీబీ, 32జీబీ)ని రూ.6,999కు, ఒప్పో రెనో 2ఎఫ్ (6జీబీ, 256జీబీ)ని రూ.17,990కి, రెనో 10ఎక్స్ జూమ్‌ను రూ.26,990కి, రెనో 2 (8జీబీ, 256జీబీ)ని రూ.28,990కి, రెనో 2జ‌డ్ (8జీబీ, 256జీబీ)ని రూ.27,490కి, వివో నెక్స్ (8జీబీ, 128జీబీ)ని రూ.23,990కి, ఎల్‌జీ వి30 ప్ల‌స్ (4జీబీ, 128జీబీ)ని రూ.19,999కి, ఐక్యూ 3 ఫోన్‌ను రూ.31,990కి కొన‌వ‌చ్చు.

అలాగే గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ప్రీమియం ల్యాప్‌టాప్‌ల‌పై ఉత్త‌మ‌మైన డీల్స్‌ను అందిస్తున్నారు. ఇక ఆడియో ప్రొడ‌క్ట్స్‌, ట్యాబ్లెట్లు, ఫిట్‌నెస్ బ్యాండ్స్‌, స్మార్ట్‌వాచ్‌లు, టీవీల‌పై రాయితీలను అందిస్తున్నారు. సిటీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల‌తో ప్రొడ‌క్ట్స్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news