ఆ బాధ నేను భరించలేను: మంత్రి హరీష్

-

తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆయన అన్నారు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు అని కీర్తించారు.

తెలంగాణ ఉధ్యమంలో జర్నలిస్టుగా, ఉధ్యమ కారుడిగా కీలక పాత్ర పోషించారని న్నారు. నేను లింగన్న అని అత్మీయంగా పిలుచుకునే మంచి మనిషిని కోల్పోవడం దురుదృష్టకరమని ఆయనఆవేదన వ్యక్తం చేసారు. వారి అకాల మరణానికి సంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఆయన ట్వీట్ చేసారు. కాసేపటి క్రితం లింగారెడ్డి భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news