గుడ్ న్యూస్: ఫ్లిప్‌కార్ట్‌లో ఇక నుండి ఈ సర్వీసులు కూడా..!

-

సులభంగా ఇంట్లో వుండే మనం ఫ్లిప్ కార్ట్ ద్వారా షాపింగ్ చెయ్యచ్చు. అయితే ఇప్పుడు ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ డిజిటల్ కామర్స్ విభాగాల్లో సేవలను ఎక్స్టెండ్ చెయ్యాలని అనుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్‌ హోటల్‌ బుకింగ్స్ సేవలను తీసుకు రానుంది. మరి ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఫ్లిప్‌కార్ట్‌ హోటల్‌ బుకింగ్స్ సర్వీసెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కనుక ఇక నుండి ఫ్లిప్‌కార్ట్ యాప్ ‌ద్వారా హోటల్ రూమ్స్ బుక్‌ చేసుకోవచ్చు. కస్టమర్స్ ఇక నుండి ఈ యాప్ ని ఉపయోగించి హోటల్‌ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇందులోకి రావాలనే ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ క్లియర్‌ట్రిప్‌ను కంపెనీ గత ఏడాది కొనుగోలు చేసినది ఇప్పుడు ఈ వ్యాపారం మొదలు అవుతోంది.

క్లియర్‌ట్రిప్ API సపోర్ట్‌, ట్రావెల్‌ సెక్టార్‌, కస్టమర్లపై అవగాహన ఉండడం ఫ్లిప్‌కార్ట్ కి ఉపయోగపడుతుంది. బుకింగ్ ఎక్స్‌పీరియన్స్ ని ఎటువంటి సమస్యలు లేకుండా ఫ్లిప్ కార్ట్ ఇస్తుందని ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల ద్వారా అప్డేట్స్ ని అందిస్తుందని చెప్పింది సంస్థ. 3 లక్షల నేషనల్‌, ఇంటర్నేషనల్‌ హోటళ్లలో గదులను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది కంపెనీ.

EMI ఆప్షన్లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌స్ కూడా వున్నాయి. ఫ్లెక్సిబుల్ ట్రావెల్, బుకింగ్ రిలేటెడ్ పాలసీలను కూడా ఇది ఇస్తున్నట్టు తెలిపారు. అలానే ప్రత్యేక కస్టమర్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా హోటల్ బుకింగ్ సేవలపై అందించే ఫీడ్‌బ్యాక్‌, ఫిర్యాదుల ఆధారంగా సపోర్ట్‌ చేస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news