గత కొద్దిరోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న అర్థరాత్రి నుండి సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు పలు చెరువులకు గండి పడింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఇల్లు, పంటపొలాలు నీట మునిగాయి.
బస్వాపూర్ వద్ద వాగు ఉధృతికి సిద్దిపేట-హనుమకొండ రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అంతే కాకుండా ఏపీలోని కర్నూలు, వైజాగ్, విజయవాడ, గుంటూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా హైదరాబాద్ లోనూ నిన్నరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లొ భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.