క్రికెట్ అంటే మన దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఆటలు అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది క్రికెట్ మాత్రమే. ఈ కారణంగానే మన దేశంలో కేవలం క్రికెట్ ను ఇంతలా ఆరాధిస్తుంటాం. ఇక పోతే క్రికెట్ అనగానే గుర్తుకు వచ్చే గాడ్ సచిన్ మాత్రమే. ఆయన వల్లే క్రికెట్‌కు ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. ఇక చాలాకాలం ఆడినత తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే సచిన్‌కు ఉన్న ఫాలోయింగ్ కారణంగా మామూలుగానే ఆయన వీడియోలు అంటే నెట్టింట విపరీతంగా వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సోసల్ మీడియాలో లో కూడా సచిన్‌కు ఎక్కువగా ఫాలోయింగ్ ఉండటం అంటే మిలియన్లలో ఉన్నారు మరి. అందుకే ఆయన పెట్టిన ప్రతి వీడియో కూడా ఇట్టే వైరల్ అవుతుంది. ఇక ఇప్పడు కూడా ఆయన మరో ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు.
అయితే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భం గా దేశ యువతకు ఆయన స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేయడంతో పాటు యువతకు గొప్ప సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో యువత ఎక్కువగా క్రీడలను అలవాటుగా మార్చుకోవాలని అప్పుడే జీవితం ఉన్నతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆయన షేర్ చేసిన వీడియోని చూస్తే ఇందులో ఆయన క్రికెట్ ఆడుతున్నారు. కాకపొతే ఆయన చిన్న పిల్లలతో ఇంట్లోనే ఆడుతున్నారు.
Sport brings hope and joy even in the most challenging circumstances. This #NationalSportsDay, make playing a habit. Keep ourselves and those around us happy. pic.twitter.com/LUMF2N4wUx
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2021