భారీ వర్షం.. కేసీఆర్ సభ ప్రాంగణంలోకి వరద నీరు

-

కరీంనగర్ జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ హుజురాబాద్‌ నియోజక వర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ పర్యటన నేపథ్యంలో భారీ వర్షం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. హుజురాబాద్ మండలం శాలపల్లి (ఇందిరానగర్) ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ప్రాంగణంలోకి వరుద నీరు భారీగా చేరింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సభ ఆవరణలోని రోడ్ల మీదకు నీరు చేరి గుంతల మయం అయిపోయింది.

జేసిబితో సభ ప్రాంగణం చుట్టూ మూడు ఫీట్ల మేర కందకం కొట్టి… నీళ్లను బయటకు పంపిస్తున్నారు సభా నిర్వహాకులు. అలాగే కంకర చూరతో గుంతల రోడ్లను పూడ్చి వేస్తున్నారు. ఇక బురద మయం అయిన మట్టి రోడ్లపై కంకర చూర వేసి లెవలింగ్‌ చేస్తున్నారు. కాగా… ఇక అటు సీఎం కేసీఆర్‌ సభకు గ్రామాల వారీగా జనం తరలి రానున్నారు. దీని కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. మంత్రులు మండల కేంద్రాల్లో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు
మంత్రులు గంగుల, మరియు కొప్పుల. అటు సభ దగ్గర మంత్రి హరీష్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news