హైదరాబాద్ లో ఫుడ్ డెలివరి కూడా లేనట్టే…?

-

హైదరాబాద్ లో ఇప్పుడు సరకు రవాణా వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు అనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. మూడు కమీషనరేట్ పరిధిలో సరకు రవాణా వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ పరిధి లోని కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే సరకు రవాణా వాహనాలకు అనుమతినిచ్చారు.

సరకు రవాణాతోపాటు లోడింగ్‌ , అన్‌లోడింగ్‌ కూడా నిర్దేశించిన సమయంలోనే అనుమతి ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రహదారులపైకి సరకు రవాణా వాహనాలు వస్తే చర్యలు ఉంటాయని సీపీలు అంజనీకుమార్‌ , సజ్జనార్ , మహేష్ భగవత్ లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు నగరంలో పలు చోట్ల ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌లను పోలీసులు ఆపేస్తున్నారు అని కూడా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news