అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. 8 లక్షలకు కరోనా వైరస్ కేసులు చేరుకున్నాయి. మరణాలు కూడా అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అమెరికాలో మొత్తం 7,63,832 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజే అక్కడ 1539 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగా 25 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 40,553 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికాలో లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి కేకలతో అమెరికాలో ఇప్పుడు జనం చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతుంది. లాక్ డౌన్ ని అమలు చేయడం తో ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్స్ కూడా మూత పడ్డాయి.
అక్కడ చేతి నిండా డబ్బులు ఉన్నా సరే ఇప్పుడు తినడానికి తిండి లేదు. వ్యాపారాలన్నీ మూతపడటంతో 2 కోట్ల మందికి పైగా రాత్రికి రాత్రి ఫుడ్ బ్యాంక్‌ల వైపు చూడని వాళ్లు ఎదురు చూస్తున్నారు. ఆహారం కోసం అమెరికన్లు ఎదురు చూస్తున్నారు. మంగళవారం పెన్సిల్వేనియాలోని గ్రేటర్ పిట్స్‌బర్గ్ కమ్యూనిటీ ఫుడ్ బ్యాంకు ముందు వేలాది మంది బార్లు తీరారు. టెక్సస్, కాలిఫోర్నియాలోనూ ఇదే పరిస్థితి ఉంది.