కరోనా వైరస్ నివారణలో మాస్క్ అనేది చాలా అవసరం. మాస్క్ పెట్టుకోవాలని ప్రధాని నుంచి ప్రతీ ఒక్కరు కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నారు.మాస్క్ లేకుండా అసలు ఎవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు మాస్క్ లేకుండా బయటకు వస్తే మాత్రం కచ్చితంగా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్క్ ల కోసం జనం పోటీ పడుతున్నారు.
ఇక ఇప్పుడు కరోనా కట్టడిలో ఎన్95 మాస్క్‌లకు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మాస్క్ ని అందరూ ధరించాలి అని భావిస్తున్నారు. కనీసం దీని నుంచి గాలి కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. అందుకే దీన్ని కొనుగోలు చెయ్యాలి అని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటీ అంటే… ఎన్95 ధర ఎక్కువ. దీనితో సామాన్యులకు ఇది అందుబాటులో ఉండదు.
ఈ నేపధ్యంలో దిల్లీ ఐఐటీకి చెందిన అంకుర సంస్థ ‘ఈటెక్స్’.. కవచ్ పేరుతో ఎన్95 తరహాలో ఒక మాస్క్ ని తయారు చేసింది. అదే సామర్ధ్యంతో ఇది పని చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రంతో తయారుచేసిన ఈ మాస్క్ 3 మైక్రాన్ల స్థాయి రేణువులను 98% వరకూ వడపోస్తుందని, ధర 45 రూపాయలు మాత్రమేనని వాళ్ళు చెప్తున్నారు. కనీసం దీనిని పది సార్లు వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు.