రాజయ్యతో ట్విస్ట్‌లు..ఘనపూర్‌లో పోరు రసవత్తరం!

-

సీటు దక్కని సీనియర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..బి‌ఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇస్తారా? కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహా..రాజయ్యతో భేటీ కావడంతో..ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారా? అసలు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే చర్చ ఎక్కువ నడుస్తోంది. చాలాకాలం నుంచి ఘనపూర్ లో అటు రాజయ్య, ఇటు కడియం శ్రీహరిలు ప్రత్యర్ధులే అనే సంగతి తెలిసిందే. రాజయ్య కాంగ్రెస్, కడియం టి‌డి‌పి నుంచి పోటీ పడేవారు. మధ్యలో రాజయ్య బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. బి‌ఆర్‌ఎస్ లో గెలుస్తూనే వస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి తాటికొండ రాజయ్య..క్లారిటీ ఇచ్చిన దామోదర ! - Manalokam

ఇటు కడియం కూడా టి‌డి‌పిని వదిలి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2014లో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో రాజయ్యని మంత్రివర్గంలో తీసుకున్నారు. కానీ మధ్యలోనే ఆయన్ని సైడ్ చేశారు. ఎంపీగా ఉన్న కడియంని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. అయితే 2018 ఎన్నికల్లో సీటు రాజయ్యకే ఇచ్చారు. దీంతో మళ్ళీ ఆయన గెలిచారు. ఇటు కడియంకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక ఈ ఇద్దరి మధ్య పోరు తారస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు డైరక్ట్ గా విమర్శలు  చేసుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా కే‌సి‌ఆర్..సీటు ఈ సారి రాజయ్యకు కాకుండా కడియంకు ఇచ్చారు. దీంతో సీన్ మారింది. సీటు దక్కని రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజయ్యని తాజాగా కాంగ్రెస్ సీనియర్ దామోదర రాజనరసింహ కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళుతున్నారనే ప్రచారం వస్తుంది. ఒకవేళ రాజయ్య కాంగ్రెస్ లోకి వెళితే..బి‌ఆర్‌ఎస్ నుంచి కడియం పోటీ చేస్తుండటంతో మళ్ళీ పోరు రసవత్తరం అవుతుంది. చూడాలి మరి ఈ సారి స్టేషన్ ఘనపూర్ లో ఎవరు గెలుస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news