ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం.. ఆమె కడుపులో వేలాది పురుగుల గుడ్లు

-

మీరు ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తింటున్నారా, అయితే తప్పకుండా ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకోవాల్సిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు 34 ఏళ్ల జేసి అనే మహిళ తొమ్మిది నెలల కిందట ఫ్రిజ్లో నిల్వ ఉంచిన సుశీ చేప అనే వంటకాన్ని తిన్న దట. అయితే ఆమె దాన్ని కొనుగోలు చేసి సుమారు ఐదు రోజులు అవుతుంది. అప్పటినుంచి అది ఫ్రిడ్జ్ లోనే ఉంది. అది తిన్న నాలుగు నెలల తర్వాత ఆమె కడుపులో ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. అయితే హాస్పిటల్ వెళ్లేందుకు ఇష్టపడేది కాదు. తన కడుపులో ఏదో చేప ఈదుతున్నట్లుగా ఉన్నట్లుగా ఉందని ఆమె తెలిపేది. అప్పటి నుంచి ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది. ఆమెలో ఆత్రుత పెరిగింది. దీంతో ఆమె నిద్ర మాత్రలు వాడింది. కడుపులో గుడ‌గుడ‌లు తగ్గేందుకు అనేక మందులు మింగింది కానీ ఫలితం లేకపోయింది.ఒక రోజు రాత్రి ఆమె కాళ్లు చేతులు కదల్లేదు. పదే పదే మూర్ఛ వచ్చి పడిపోయేది దీంతో భర్త జేసీని హాస్పటల్లో చేర్చాడు.

ఆమెకు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు నిర్వహించగా వేలాది ఏలిక పాముల గుడ్లు ఆమె కడుపులో కనిపించాయి. అంతేగాకకు టేప్ వార్మ్ చెందిన కొన్ని భాగాలను కూడా ఆ నమూనాలో గుర్తించారు. దీంతో ఆమె కడుపులో టేప్ వార్మ్ పెరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు గుర్తించారు.ఇవి కడుపులో కనీసం 9 మీటర్ల పొడవు ప పెరుగుతాయని వాటి వల్ల ఆమె కడుపులో ఏదో కదులుతున్న అనుభవం కలిగి ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరాన్న జీవి శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ b12ను ఎక్కువగా ఇష్టపడుతుంది అని అది పూర్తిగా శరీరానికి అందకుండా చేయడం వల్ల ఆమెలో పౌష్టికాహార లోపం తలెత్తి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసిందని వైద్యులు తెలుసుకున్నారు.ముఖ్యంగా ఆమె నరాల కణాల్లో రక్తాన్ని అది బ్లాక్ అయినట్లు తెలుసుకున్నారు.ప్ర‌జీ క్వాంటెల్ అనే యాంటీ వార్మ్ ఔషధం ద్వారా ఆమెకు చికిత్స చేశారు. మీరు ఫ్రిజ్ లో ఏదైనా ఆహారాన్ని నిల్వ ఉంచి తిన్నట్లయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు ఫ్రిజ్లో ఆహారాన్ని నిల్వ ఉంచే తినకపోవడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news