ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసే ఆహార పదార్థాలు…!

-

మానవ శరీరంలో అతి ముఖ్య పాత్ర పోషించేవి ఊపిరితిత్తులు. మనకు ఇవి శ్వాస తీసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాంటి కీలక అవయవాలకు ఇన్ఫెక్షన్ లు సోకి అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. వీటిని గుర్తించడంలో ఆలస్యం అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ గా మారతాయి. క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల్లో కణాలు విపరీతంగా పెరగడం. దానికి సరైన వైద్యం అందక క్యాన్సర్ కారకాలుగా మారతాయి. ఇవి శరీరంలో ఒక చోటు నుండి మరో చోటుకి వ్యాపిస్తాయి.

ఈ క్యాన్సర్ కణాలను నియంత్రించడానికి మన ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్కువగా నీళ్ళు తాగాలి. తాజా కూరగాయలు, పండ్లని తీసుకోవాలి. ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదం చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. బీన్స్, బ్రోకోలి, ఆకుకూరలు, వాల్ నట్స్, యాపిల్స్, చేప, ఆఫ్రికాట్, చికెన్, గుడ్లు వంటివి. వీటిలో ఉండే విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు ఊపిరి తిత్తులకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా కాపాడతాయి.

బీన్స్: వీటిలో మూడు రకాలు బ్లాక్ బీన్స్, పింటూ బీన్స్, కిడ్నీ బీన్స్. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ వల్ల ఊపిరితిత్తులకు నష్టం కలిగించే ప్రీరాడికల్స్ తో పోరాడతాయి.

బ్రకొలి : ఇది గ్రీన్ వెజిటబుల్స్ అన్నిటిలో మంచిది. దీన్ని రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం గా ఉంటాయి.

ఆకుకూరలు : వీటిలో ఉండే బి విటమిన్ లంగ్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.

వాల్ నట్స్ : రోజు గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల అస్తమా మరియు ఇతర శ్వాస సంబంద సమస్యలను నివారిస్తుంది.

యాపిల్: యాపిల్స్ ని ఖచ్చితంగా రోజు ఒకటి చొప్పున తినడం వల్ల ఊపిరితిత్తులు సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటాయి.

చేపలు, చికెన్, గుడ్లు: శాకాహారం నుండి అందే విటమిన్ ఏ వీటి ద్వారా చాలా త్వరగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news