సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం రూ. 600 కోట్లకు పైగా నిధులను కేటాయించినట్లు ప్రకటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎయిర్ పోర్ట్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు కిషన్ రెడ్డి. దేశ అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాలకులు వస్తారు.. పోతారు.. అధికారం ఎవరికి శాశ్వతం కాదని..ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలనీ కోరారు. నగర వీధుల్లో తిరంగా జెండా తో బైక్ ర్యాలీ నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
తెలుగుబిడ్డ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను చేత పట్టి.. ప్రతి ఇంటిపై ఎగురవేయాలన్నారు. జెండాల కొరత ఉంది.. ఉన్నంతలో సమీకరించి జెండా ఎగురవేద్దామని.. ఈ జెండా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. జెండాలను భద్రంగా గౌరవంగా దాచి పెట్టండని.. రాజకీయాలకు సంబంధం లేని పండగ ఇదని పేర్కొన్నారు.