శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 1.40 కిలోల బంగారం పట్టివేత

-

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు.

ఇవాళ తెల్లవారుజామున 2.55 గంటలకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ 52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈరోజు తెల్లవారుజామున 3.45గంటలకు వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news