కేటీఆర్ లీడింగ్..ఫ్యూచర్ ‘సీఎం’కు హింట్!

-

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్ లో నడిపించే నాయకుడు ఎవరు? మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే సి‌ఎం అయ్యేది ఎవరు? అంటే అందరూ ఠక్కున కే‌టి‌ఆర్ పేరు చెప్పేస్తారు. ఎందుకంటే ఆయనే భవిష్యత్‌లో తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీని నడిపించే నాయకుడు అని చెప్పవచ్చు. అందుకే ఇప్పటినుంచే ఆయన ఆధిక్యం తీసుకుని ముందుకెళుతున్నారు. కే‌సి‌ఆర్ కేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం,. బి‌ఆర్‌ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు కే‌సి‌ఆర్..తెలంగాణలో పార్టీని గెలిపించడంపై కృషి చేస్తారని తెలుస్తోంది. ఎలాగో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో పార్టీని గెలిపించి..కొన్ని రోజుల పాటు ఆయనే సి‌ఎం గా ఉండి..పార్లమెంట్ ఎన్నికలు రాగానే..ఎంపీగా పోటీ చేసి..కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనేది కే‌సి‌ఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. అప్పుడు కే‌సి‌ఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే..తెలంగాణ సి‌ఎంగా కే‌టి‌ఆర్‌ని పెడతారని తెలుస్తోంది. ఆ దిశగానే ఇప్పటినుంచే రాజకీయం జరుగుతుందని తెలుస్తోంది.

కే‌సి‌ఆర్ ఓ వైపు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. అయితే కే‌టి‌ఆర్ పూర్తిగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. ఎక్కడక్కడ అభివృద్ధి పనుల పేరుతో ఆయన బహిరంగ సభలు పెడుతున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రదాన ప్రత్యర్ధులుగా భావిస్తున్న కాంగ్రెస్, బి‌జే‌పిలు టార్గెట్ గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్యంగా ఆయనకు సమకాలికులు ఉంటూ..దూకుడుగా రాజకీయంగా చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తే భవిష్యత్ లో ఈ ముగ్గురు మధ్యే రాజకీయ యుద్ధం జరగడం ఖాయమని తెలుస్తోంది.అందుకే కే‌టి‌ఆర్ కూడా తెలివిగా..ఆ ఇద్దరినే టార్గెట్ చేత్సున్నారు. ఆ ఇద్దరు కూడా కే‌టి‌ఆర్ లక్ష్యంగానే రాజకీయం నడిపిస్తున్నారు. దీని బట్టి చూస్తే తెలంగాణ బీఆర్ఎస్ లో కే‌టి‌ఆర్ లీడింగ్ తీసుకుని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news