నెల్లూరులో ట్విస్ట్‌లు..జంపింగులు..వైసీపీకి చిక్కులు.!

-

కంచుకోట లాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీకి చిక్కులు వచ్చి పడ్డాయి. ఊహించని ట్విస్ట్‌లు జంపింగులతో వైసీపీకి షాకులు తగిలాయి. పూర్తి పట్టున్న జిల్లాలో వైసీపీ పరిస్తితి కాస్త ఇబ్బందికరంగా మారింది. అసలు నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట అని చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆఖరికి స్థానిక ఎన్నికల్లో 90 శాతం వరకు విజయాలు దక్కించుకుంది. ఇటు నెల్లూరు నగర కార్పొరేషన్ లో సైతం స్వీప్ చేసింది.

అలాంటిది ఇప్పుడు జిల్లాలో వైసీపీ కాస్త ఇబ్బంది పడుతుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్ ఇవ్వడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది కూడా ముగ్గురు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ముగ్గురు బడా నేతలు..నెల్లూరుపై పట్టున్న నాయకులు. అయితే అనూహ్యంగా వీరు వైసీపీకి షాక్ ఇచ్చి బయటకొచ్చారు. ముందు ఆనం, కోటంరెడ్డి బయటకు వచ్చేశారు. మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి ఈ ఇద్దరితో పాటు మేకపాటి కూడా ఓటు వేశారని అనుమానించి వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

 

దీంతో మేకపాటి కూడా ఇప్పుడు వైసీపీకి దూరమయ్యారు. ఇలా ముగ్గురు బడా నేతలు వైసీపీకి దూరం అవ్వడం అనేది కాస్త మైనస్ అని చెప్పవచ్చు. ఎంతకాదు అనుకున్న నెల్లూరులో వైసీపీకి బలం ఉన్నా సరే..ఈ ముగ్గురు నేతలు బయటకు రావడం అనేది కాస్త ఇబ్బందే. ఎందుకంటే ఈ ముగ్గురుకు వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఉంది. ఇక వీరు టి‌డి‌పి వైపుకు వెళ్లడానికి చూస్తున్నారు.

అదే జరిగితే నెల్లూరులో వైసీపీకి షాక్ తప్పదు..అయితే ఈ ఇద్దరే కాదు..ఇంకా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని వారు కూడా వైసీపీకి షాక్ ఇస్తారని ప్రచారం వస్తుంది. అంటే నెల్లూరులో వైసీపీకి కాస్త డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news