ఏపీలో నిన్నటి నుంచి కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమైంది. నిన్న ఉదయం 9 గంటల సమయంలో సీఎం జగన్ చేతుల మీదుగా 26 జిల్లాల పరిపాలన ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు అమల్లోకి రాగా… మరో కొత్త జిల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
గిరిజన ప్రాంతాలను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా… రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాల తో కలిపి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని ఇవాళ మీడియాకు వివరించారు.
ప్రస్తుతం రంపచోడవరం…అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండగా… జిల్లా కేంద్రం దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ అందరిలోనూ వినిపిస్తుంది. అలాగే ఏపీలో మార్కెట్ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.