మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ తడిసిముద్దైంది..భారీ వర్షాలతో నగరం నరకప్రాయంగా మారింది..గతంలో ఎన్నడు లేని విధంగా ఒక్కరోజే 32 సెంటీ మీటర్ల వర్షం కురిసింది..ఎక్కడా రోడ్లు కన్పించడంలేదు. ఏ రోడ్డు చూసినా చెరువునే తలపిస్తుంది..ముఖ్యంగా రోజంతా కురిసిన వర్షాలని నగరంలో వందలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు నీటితో నిండిపోయాయి..చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి..భారీ గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల కూలిపోయాయి. దీంతో నగరంలోని చాలా కాలనీల్లో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ లేక నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు..దీంతో జీహెచ్‌ఎంసీ గ్రేటర్‌లో హైఅలర్ట్ ప్రకటించింది..ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావోద్దని అధికారులు హెచ్చరించారు.
మరో వైపు భారీ వర్షాలు పాతబస్తీలో విషాదం మిగిల్చింది..ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలి 9మంది మృతి చెందారు..ఘటన స్థలానికి చెరుకున్న ఎన్‌డీఆర్‌ఎస్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు ఒకరి మృత దేహాం బయటకు తీయగ..మిగత వారికోసం సహయక చర్యలుకొనసాగుతున్నారు..మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనుండటంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జల దిగ్భంధంలో హైదరాబాద్..పాతబస్తీలో ఇళ్లు కూలి 9 మంది మృత
-