రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కు ఊహించని షాక్ తగిలింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తాను ఐదు సంవత్సరాల క్రితం కలెక్టర్ గా పనిచేసిన సమయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలంటూ ఆయన లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు.
960 ఇళ్ళను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు మురళిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. స్టేషన్ లోనూ ఆకునూరి మురళి ఆందోళన కొనసాగించారు. మురళికి మద్దతుగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు, మహిళలు స్టేషన్ కు తరలివచ్చారు. లబ్ధిదారులకు ఇల్లు కేటాయించే వరకు తాను ఆందోళన విరమించే ప్రసక్తి లేదని ఆకునూరి భీష్ముంచుకుని కూర్చోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.