HBD: రమ్యకృష్ణ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నవరసాలను అలవోకగా పోషించే అతికొద్ది మంది నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు అని చెప్పవచ్చు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ వస్తోందంటే ఇక ఆమె అందానికి మంత్రం ముగ్ధులు అవని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. ఇకపోతే 1985లో భలే మిత్రులు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రమ్యకృష్ణ 1965 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. ఇక తన అందాలతో, అభినయంతో కుర్రాలను తన వశం చేసుకున్న రమ్యకృష్ణ తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగింది. నరసింహ, బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లోని నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక నీలాంబరిగా తన యాక్టింగ్ లో అదరగొట్టిన ఈమె గ్లామర్ విషయంలో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేస్తుంది.

ఇక నటిగా రాజసం చూపించే రమ్యకృష్ణ దేవత మూర్తి పాత్రలో కూడా మెప్పించగలరు. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన దైన మార్కును సొంతం చేసుకుంది. తమిళ సినిమా వెళ్ళై మనసుతో తమిళ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన ఈమె తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం మొత్తం అన్ని భాషల్లో కలుపుకొని 270కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది. ఇకపోతే కెరియర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ రమ్యకృష్ణ కే.విశ్వనాథ దర్శకత్వంలో తెరకెక్కిన సూత్రధారులు సినిమాతో నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక 1990లో మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు సినిమాతో రమ్యకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆమె గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ ఇలా అందరి స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యధిక సినిమాలలో హీరోయిన్గా నటించిన వారు రమ్యకృష్ణనే కావడం గమనార్హం. అంతేకాదు వీళ్ళ కాంబినేషన్లో సుమారుగా 13 పైగా సినిమాలు తెరకెక్కాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు నంది పురస్కారాలను కూడా అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news