దొరల గడీల నుండి విముక్తి లభించినందుకు సంతోషంగా ఉంది – పొంగులేటి

-

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నుండి సస్పెండ్ చేయడం పై స్పందించారు మాజీ ఎంపీ పొంగులేటి. తనని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనవరి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని.. 100 రోజుల తర్వాత అయినా బిఆర్ఎస్ నేతలు ధైర్యం తెచ్చుకొని తనని సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు.

దొరల గడీల నుంచి విముక్తి లభించినందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడని.. అయితే అది పగటి కలగానే మిగిలిపోతుంది అన్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాలలో అసమ్మతి ఉందని.. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గెలవడం ఈజీ కాదని అన్నారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news